* సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన పూజారి వీడియో
* స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
* జగద్గిరిగుట్టలోభూముల పరిశీలన
మేడ్చల్, జనవరి18: తాను ధూపదీప నైవేద్యం పెడుతున్న ఆలయ భూమి కళ్లెదుటే అన్యాక్రాంతానికి గురవుతుంటే ఆ పూజరి గుండె తరుక్కుపోయింది. కబ్జా గురించి ఎవరికి చెప్పినా ఫలితం లేకపోయింది. ఈ క్ర ఆలయ గుండం కబ్జాకు గురవుతోందని కాపాడాలని ఏడుస్తూ ఇటీవల వీడియో తీసి సోషల్ మీడియోలో పోస్టు చేశాడు.
అది కాస్తా వైరల్ అవడంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ దృష్టికి వచ్చింది. దీంతో రం భు మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట గోవిందరాజుల స్వామి ఆలయానికి సంబంధించిన భూములను శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్థానికులు పెద్ద సంఖ్యలో ఆలయ భూముల కబ్జా విషయంతో పాటు సమీపంలోని పరికి చెరువు విషయమై రంగనాథ్ దృష్టికి తీసుకువచ్చారు.
స్థానికుల ఫిర్యాదు మేరకు ఆలయ భూములతో పాటు పరికి చెరువును రంగనాథ్ పరిశీలించారు. అనంతరం రంగనాథ్ మాట్లాడుతూ.. బుధవారం హైడ్రా కార్యాలయంలో జగద్గిరిగుట్ట గోవిందురాజుల స్వామి ఆలయ భూమి, పరికి చెరువు కబ్జాపై స్థానికులతో సమావేశం ఏర్పాటు చేస్తామని.. సమావేశానికి హాజరై కబ్జాకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలన్నారు.
దేవాలయ, పరికి చెరువు పరిరక్షణ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని, వీటి వాట్సాప్ గ్రూపులలో తనను యాడ్ చేసి సమాచారం షేర్ చేయాలని సూచించారు. క్షేత్ర పరిశీలనలో హైడ్రా, రెవెన్యూ, ఇరిగేషన్, దేవాదాయ శాఖల అధికారులు పాల్గొన్నారు.