calender_icon.png 2 November, 2024 | 7:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మా ఎమ్మెల్యేల హక్కులు కాపాడండి

16-07-2024 01:17:00 AM

  1. ప్రొటోకాల్ ఉల్లంఘిస్తున్న ప్రభుత్వం
  2. అహంకారంతో ప్రజాస్వామ్యం అపహాస్యం
  3. స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ 

హైదరాబాద్, జూలై 15 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల హక్కులను కాలరాసే విధంగా కొత్త సంస్కృతిని తీసుకొచ్చిందని  బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తమ ఎమ్మె ల్యేల హక్కులు కాపాడాలని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు సోమవారం బహిరంగ లేఖ రాశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు లేని చోట కావాలనే ప్రభుత్వం విపక్ష ఎమ్మెల్యే హక్కులకు భంగం కలిగిసోందని ఆరోపించారు. ప్రతి సందర్భంలో ప్రొటోకాల్ ఉల్లంఘనలకు పాల్పడు తూ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించడం కాం గ్రెస్ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి సంప్రదాయం ఎంతమాత్రం మంచిది కాదని హితవు పలికారు. 

మేం అలా చేయలేదే..!

బీఆర్‌ఎస్ దాదాపు పదేళ్లు అధికారంలో ఉందని, కానీ ఎప్పుడూ విపక్ష ఎమ్మెల్యేల హక్కులను కాలరాయలేదని కేటీఆర్ తెలిపారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యే లను బీఆర్‌ఎస్ ప్రభుత్వం గౌరవించిందని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కావాలనే తమ పార్టీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ ప్రొటోకాల్ ఉల్లంఘన లకు పాల్పడుతోందని ఆరోపించారు. ప్రజ ల చేత ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేలకు వారి నియోజకవర్గంలో జరిగే ఏ పనికైనా ప్రొటోకాల్ ఉంటుందని ప్రభుత్వానికి తెలియదా? అని ప్రశ్నించారు. కల్యాణిలక్ష్మి చెక్కుల పంపి ణీ నుంచి ఇతర ప్రభుత్వం సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ధిదారులకు అందిం చాల్సిన చెక్కుల వరకు స్థానిక ఎమ్మెల్యేను కాదని కాంగ్రెస్ నాయకులే పంపిణీ చేస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభ కార్యక్రమాలు కూడా ఎమ్మెల్యే లేకుండానే పూర్తి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేనిచోట పోటీచేసి ఓడిపోయిన అభ్యర్థి లేదంటే అక్కడి కాంగ్రెస్ నాయకులే ఎమ్మెల్యేలు అన్నట్లుగా వ్యవహారం జరుగుతోం దని మండిపడ్డారు. హుజూరాబాద్, మహేశ్వరం, ఆసిఫాబాద్ ఇలా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే లు ఉన్న చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉందని తెలిపారు. ప్రభుత్వ పెద్దలు అధి కారులను బెదిరించిన తాము చెప్పిన విధం గా చేసే పరిస్థితి తీసుకొచ్చారని విమర్శించా రు. గత ఏడు నెలలుగా  వరుసగా ఇలాంటి ప్రొటోకాల్ ఉల్లంఘననలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఎమ్మెల్యేల హక్కులను రక్షించే అధికారం స్పీకర్‌కు మాత్రమే ఉం టుందని, వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. పార్టీలతో సంబంధ లేకుండా ఎమ్మెల్యేల హక్కులు, ప్రొటోకాల్, వారి గౌరవానికి భంగం కలగకుండా చూసుకోవా ల్సిన బాధ్యత తమపై ఉందని స్పీకర్‌కు సూచించారు. ఎమ్మెల్యేల ప్రొటోకాల్ పరిరక్షణ కోసం వెంటనే సీఎస్ సహా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు.