calender_icon.png 28 February, 2025 | 4:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొక్కలను సంరక్షించాలి..

18-02-2025 06:50:54 PM

జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్...

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా వేసవి కాలం దృష్ట్యా మొక్కలకు వాటరింగ్ నిర్వహించాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం గాంధారి మండలం పేట్ సంగం గ్రామంలో రోడ్డుకిరువైపులా ఉన్న మొక్కలకు కలెక్టర్ నీళ్లు పోశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఉష్ణోగ్రత పెరుగుతున్న క్రమంలో మొక్కలకు ప్రతిరోజూ నీళ్లు పోయాలని, మొక్కలను సంరక్షించాలని తెలిపారు. చనిపోయిన మొక్కల స్థానంలో కొత్తగా మొక్కలను నాటాలని సూచించారు. సెగ్రిగేషన్ షెడ్ నిర్వహణ సక్రమంగా లేదని, ఇంటింటి తడి పొడి చెత్త సేకరణ నిర్వహించాలని, వర్మి కంపోస్టు తయారు చేయాలని తెలిపారు. చెత్తను దూర ప్రాంతంలో వేయడంపై ఆగ్రహాం వ్యక్తం చేశారు. వైకుంఠ ధామంలో మొక్కలను పెంచాలని సూచించారు. అనంతరం నర్సరీ లో మొక్కల పెంపకం ను పరిశీలించారు.

వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి

 ఫిజికల్ సైన్స్, ఇంగ్లీష్ పాఠాలలోని ప్రశ్నలను అడిగి బోర్డులపై రాయించారు. విద్యార్థుల్లో దాగి వున్న ప్రతిభను కలెక్టర్ రాబట్టారు. పరీక్షల నేపథ్యంలో ఒత్తిడికి లోనుకాకుండా శ్రద్ధతో చదవాలని తెలిపారు. ఇష్టమైన, కష్టమైన సబ్జెక్టుల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అర్థం కాని సిలబస్ ఉంటే టీచర్ లను అడిగి సమస్యను నివృత్తి చేసుకోవాలని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని తెలిపారు. భజనం వండే కు ముందు బియ్యం ను సరిగా కడగాలని తెలిపారు. పాఠశాలలు మిషన్ భగీరథ పైప్ లైన్ వేయాలనిఏఈఈ నీ ఆదేశించారు. మధ్యాహ్న భోజనం ఎలా ఉందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈకార్యక్రమాల్లో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రావు, మండల ప్రత్యేక అధికారిని లక్ష్మీ ప్రసన్న, తహసీల్దార్ వున్నారు.