calender_icon.png 10 March, 2025 | 3:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం సార్ మా గురుకుల్ విద్యాలయాన్ని పరిరక్షించండి

09-03-2025 07:15:20 PM

ఘట్ కేసర్ (విజయక్రాంతి): ముఖ్యమంత్రి గారు మా గురుకుల విద్యాలయాన్ని పరిరక్షించి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆ విద్యాలయ విద్యార్థినులు ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డులు పంపించారు. మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్ చేపట్టిన సేవ్ గురుకుల్ ఉత్తరాల ఉద్యమంలో భాగంగా గురుకుల్ విద్యార్థినులు పోస్ట్ కార్డుల ద్వారా ముఖ్యమంత్రి నుండి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను కోరారు. ఎంతోమందికి ఉజ్వల భవిష్యత్తు అందించిన గురుకుల్ విద్యాలయాన్ని నిర్వీర్యం చేస్తే ఊరుకోమని హెచ్చరించారు.

తమ గురుకుల్ విద్యాలయాన్ని పరిరక్షించేందుకు పూర్వ విద్యార్థి అబ్బసాని యాదగిరి యాదవ్ చేపట్టిన సేవకుల్ సేవ్ గురుకుల్ ఉద్యమంలో మేమంతా భాగస్వాములై పోరాడుతామని పేర్కొన్నారు. పోస్ట్ కార్డులు పంపించిన వారిలో గురుకుల విద్యార్థినులు ఆర్ గిరిజ, ప్రజ్ఞ, పావని, నవ్య సుష్మ పూర్వ విద్యార్థులు కంది ప్రేమ్, కుమార్, ఆంజనేయులు, శశిధర్, ఇమ్ము, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.