calender_icon.png 8 February, 2025 | 5:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ భూములను రక్షించండి

08-02-2025 12:00:00 AM

తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డికి వినతి పత్రం అందజేత 

అబ్దుల్లాపూర్‌మెట్, ఫిబ్రవరి 7 : ప్రభుత్వ భూములను రక్షించాలని ఏర్పుల నర్సింహా అన్నారు. పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీ తట్టిఅన్నారం గ్రామ సర్వే నెంబర్ 127/1 ప్రభుత్వ భూమిలో కొంత మంది అక్ర మార్కులు అక్రమ నిర్మాణాలు చేపడుతు న్నారని... వాటిని తొలగించి... ఆ అక్రమా ర్కులపై చర్యలు తీసుకొని ప్రభుత్వ భూమిని రక్షించాలని శుక్రవారం తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డికి సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. 

అనంతరం  సీపీఎం పార్టీ అబ్దుల్లాపూ ర్‌మెట్ మండల కార్యదర్శి ఏర్పుల నర్సింహా మాట్లాడుతూ... రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లా పూర్‌మెట్ మండలం  తట్టి అన్నారం గ్రామ సర్వే నెంబర్  127/1లో గల  ప్రభుత్వ భూమిలో  గత రెండు సంవత్సరాల క్రితం రెవెన్యూ అధికారులతో సర్వే చేయించి హద్దు రాళ్లు పాతినప్పటికీ..

రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, స్థానిక ప్రజా ప్రతినిధులు కలిసి అట్టి భూమిని కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్నా.. ఫారెస్ట్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. అర్హులైన పేదలు గుడిసెలు వేసుకుందామని  వెళ్లితే.. వారిపైన కేసులు పెడుతున్నా అధికారులు..

బడాబాబులు ప్రభుత్వ భూములను కబ్జాచేస్తుంటే  మాత్రం పట్టించుకోవడంలేదని విమర్శిం చారు.  అంతేకాకుండా మున్సిపాలిటీ నిధులతో  సీసీ రోడ్లు వేసినా.. ఎవ్వరూ పట్టించుకోలేదన్నారు.  వెంటనే రెవెన్యూ అధికారులు  స్పందించి అందులో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణం తొలగించి..

ఆ భూమి మొత్తానికి ఫెన్సింగ్ వేసి ప్రభుత్వ రక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారని తెలిపారు.  ఈ కార్యక్రమంలో  మునీందర్ రెడ్డి, సర్వయ్య, సుక్క రవి, ఎండీ యాకూబ్, సుధాకర్ భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.