calender_icon.png 26 November, 2024 | 11:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ భూములను కాపాడండి

30-10-2024 12:54:39 AM

సీఎస్‌ను కలిసిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ

శేరిలింగంపల్లి, అక్టోబర్ 29: జీవో నంబ ర్ 59ను దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వ భూ మలను కబ్జా చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ సీఎస్ శాంతి కుమారిని.. పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కోరారు. మంగళవారం ఈ మేరకు ప్రభుత్వ స్థలాల అన్యా క్రాంతంపై సీఎస్‌ను కలిసి పూర్తి ఆధారాలతో సహా ఆయన ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జీఓ నంబర్ 59ని దుర్వినియోగం చేస్తూ గచ్చిబౌలి డివిజన్ పరిధిలో నానక్‌రాంగూడలో సర్వే నంబర్ 149 లో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ స్థలాన్ని రెగ్యులరైజ్ చేసిన.. ప్రభుత్వ స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని, అలాగే ఖాజాగూడలోని సర్వే నంబర్ 27లోని ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని, సున్నం చెరువును మట్టితో పూడ్చి అక్రమ లేఔట్ వేసిన భూ కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎస్‌కు వివరించారు.

అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఈ తతంగం  అంతా నడిపించారని.. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు, ఇతర ఆధారాలను సీఎస్‌కు సమర్పించినట్లు గాంధీ తెలిపారు.