calender_icon.png 27 November, 2024 | 3:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కబ్జాదారుల నుంచి మా ప్లాట్లను కాపాడండి

27-11-2024 01:22:50 AM

తహసీల్దార్ ఎదుట బాధితుల వేడుకోలు

అబ్దుల్లాపూర్‌మెట్, నవంబర్ 26: భూ కబ్జాదారుల నుంచి తమ ప్లాట్లను కాపాడి.. తమకు న్యాయం చేయాలని సుమారు 200 మంది బాధితులు డిమాండ్ చేశారు. మంగళవారం ఈ మేరకు వారు అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి తహసీల్దారు సుదర్శన్‌రెడ్డికి తమ గోడు వెల్లబోసుకున్నారు.

పిగ్లీపూర్ గ్రామ రెవెన్యూ సర్వేనంబర్లు 17/1ఏ, 12/7,12/8, 12/9లో ప్లాట్లు కొనుగోలు చేశామని, ఓ ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యం, ఓ రియల్ ఎస్టేట్స్ సంస్థతో పాటు కొందరు కబ్జాదారులు రాజకీయ పలుబడితో కబ్జా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తాము గతంలోనే కోర్టుకు వెళ్లామని, కోర్టునుంచి అనుకూలత వచ్చినప్పటికీ, తమకు కొందరి నుంచి అడ్డంకులు ఎదురయ్యాయన్నారు. అనంతరం అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డి వినతిపత్రం అందజేశారు. తహసీల్దార్ స్పందిస్తూ.. త్వరలో ఆయా భూముల్లో సర్వే చేపడతామని, వారం రోజుల్లో సర్వే పూర్తవుతుందన్నారు. ఆ తర్వాత బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.