calender_icon.png 26 November, 2024 | 8:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కబ్జాదారుల నుండి మా ప్లాట్లు కాపాడండి

26-11-2024 05:55:47 PM

అబ్దుల్లాపూర్ మెట్ తహసిల్దార్ ఆఫీస్ ముందు బాధితుల ఆందోళన

అబ్దుల్లాపూర్ మెట్: భూకబ్జాదారుల నుంచి తమ పాటలను కాపాడి తమకు న్యాయం చేయాలని బాధ్యులు అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ కార్యాలయం వద్ద దాదాపుగా 200 మందితో ఆందోళన చేశారు. వారు మాట్లాడుతూ.. తాము కష్టపడి కొనుక్కున్న ప్లాట్ లను కొంతమంది భూ కబ్జాదారులు కబ్జా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్లాట్లు తమకే దక్కే విధంగా చర్యలు తీసుకోవాలని  అబ్దుల్లాపూర్ మెట్  తహసిల్దార్ ఆఫీస్ ముందు ప్లాట్లు ఓనర్స్ ఆందోళన దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం అబ్దుల్లాపూర్ మెట్ మండలం పిగ్లిపుర్ గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 17/1/A,12/7,12/8,12/9 1985- 87 సంవత్సరంలో సుమారు 1200 మంది ప్లాట్లను కొనుగోలు చేశారు.

శ్రీ నాగేశ్వర హౌసింగ్ కార్పొరేషన్, నవదుర్గనగర్ కలనీగా పేరు పెట్టుకున్నారు. అనంతరం గత కొద్ధి కాలం నుండి ఓ ఇంజనీరింగ్ కాలేజ్, ఓ రియల్ ఎస్టేట్ సంస్థ నిర్వాహకులు, కొంతమంది భూకబ్జాదారులు రాజకీయ పలుకుబడితో తమ ప్లాట్లు అన్నిటిని తొలగించి వెంచర్లు చేసి కబ్జాలకు పాల్పడుతున్నారని వారిపై కఠినమైన చర్యలు తీసుకొని తమ ప్లాట్లను తమకు అప్పగించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పిల్లల భవిష్యత్ కోసం రూపాయి రూపాయి గూడబెట్టి కొనుక్కున్న ప్లాటీన్లను కబ్జాదారులు కబ్జా చేసి మమ్మల్నే అక్కడికి రానివ్వకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తమకు రెవిన్యూ అధికారులు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎమ్మార్వో సుదర్శన్ రెడ్డికి వినతిపత్రం అందించారు.దీనిపై స్పందించిన ఎమ్మార్వో వారం రోజుల్లో సర్వే చేసి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.