11-04-2025 12:00:00 AM
డీజీపీకి భూ యజమాని రిజ్వాన్ షేర్ విజ్ఞప్తి
ముషీరాబాద్, ఏప్రిల్ 10 (విజయక్రాంతి): తాము చట్టబద్ధంగా కొనుగోలు చేసిన భూమికి, తమకు రక్షణ కల్పించాలని రాష్ట్ర డిజిపికి భూ యజమాని రిజ్వాన్ షేర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం బషీర్‌బాగ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం లోని కమ్మగూడలో గల సర్వే నెంబరు 240, 241, 242లో 10.9 ఎకరాల భూమిని ఉప్పల్‌కు చెందిన గుండ్ల రాజమ్మ వద్ద కొనుగోలు చేయడం జరిగిందని చెప్పారు.
ఈ భూమికి 2024లో కోర్టు నుంచి ఫైనల్ డిగ్రీ వచ్చిందని, తమ న్యాయవాదుల చేత అన్ని సలహాలు తీసుకుని భూమిని కొనుగోలు చేయడం జరిగిందన్నారు. గతంలో కొందరు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి అమాయక ప్రజల నుంచి డబ్బులు దండుకుని డబుల్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని ఆరోపించారు. తాము కూడా ఈ భూమి వివాదంలో ఉందని చెప్పినా వినిపించుకోకుండా బ్రోకర్ల మాటలు నమ్మి పేద ప్రజలు ఇళ్ళ స్థలాల కోసం కొనుగోలు చేసి మోసపోయారని చెప్పారు.
ఆ భూమికి సంబం ధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, దీంతో తాము కొనుగోలు చేసిన భూమికి సరిహద్దులు వేసేందుకు కూలీలను బుధవారం తీసుకొని వెళ్లడం జరిగిందని, కాగా అక్కడ ఉన్న కొంత మంది తమ కూలీలపై కర్రలు, రాళ్ళతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయంపై డయల్ 100 కు పలు మార్లు ఫోన్ వేసినా పోలీసులు స్పందించలేదని ఆరోపించారు. తమకు కోర్టు నుంచి ఫైనల్ డిగ్రీ ఉన్నప్పటికి పోలీసులు రక్షణ కల్పించక పోవడం బాధకరమని, ఈ విషయంలో రాష్ట్ర డిజిపి జోక్యం చేసుకుని రక్షణ కల్పించాలని ఆయన కోరారు.