calender_icon.png 27 November, 2024 | 3:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రక్షణ కవచనాలతో ప్రాణాలను రక్షించుకోవాలి

10-10-2024 04:42:28 PM

మానకొండూర్ (విజయక్రాంతి): ప్రతి గీత కార్మికుడు తాటి చెట్లను ఎక్కే ముందు తప్పకుండా కాటమయ్య రక్షణ కవచనాలను ధరించుకొని ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తమ ప్రాణాలను రక్షించుకోవాలని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. గురువారం తిమ్మాపూర్ మండలంలోని మానకొండూరు నియోజకవర్గం ప్రజా భవన్ కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కాటమయ్య రక్షణ కవచం సేఫ్టీ మూకుల పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గీత కార్మికులకు రక్షణ కవచనాలను పంపిణీ చేస్తున్నామని ఈ నేపథ్యంలోనే మానకొండూరు నియోజకవర్గంలోని గీత కార్మికులకు పంపిణీ చేస్తూ ట్రైనర్ ద్వారా శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం గీత కార్మికుల శ్రేయస్సు, భద్రత, కోసం ఈ రక్షణ కవచనాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ రక్షణ కవచనాలను రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల మంది గీత కార్మికులకు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బెజ్జంకి మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ గౌడ్ తిమ్మాపూర్ మండల అధ్యక్షులు మొరపల్లి రమణారెడ్డి నుస్తులాపూర్ మాజీ సర్పంచ్ సీనియర్రక్షణ కవచనాలతో ప్రాణాలను రక్షించుకోవాలి.

ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మానకొండూర్ వెలుగు ప్రతి గీత కార్మికుడు తాటి చెట్లను ఎక్కే ముందు తప్పకుండా కాటమయ్య రక్షణ కవచనాలను ధరించుకొని ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తమ ప్రాణాలను రక్షించుకోవాలని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. ప్రభుత్వం గీత కార్మికుల శ్రేయస్సు భద్రత కోసం ఈ రక్షణ కవచనాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు ఈ రక్షణ కవచనాలను రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల మంది గీత కార్మికులకు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బెజ్జంకి మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ గౌడ్, నుస్తులాపూర్ మాజీ సర్పంచ్ సీనియర్ నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాసరావు, తిమ్మాపూర్ మండల అధ్యక్షులు మొరపల్లి రమణారెడ్డి, ఎస్ఎల్ గౌ,డ్ లతోపాటు పలువురు పాల్గొన్నారు. నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాసరావు ఎస్ఎల్ గౌడ్ లతోపాటు పలువురు పాల్గొన్నారు.