calender_icon.png 24 December, 2024 | 11:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ స్థలాన్ని కాపాడండి

02-11-2024 01:54:26 AM

రాజీవ్ రహదారిపై లక్ష్మక్కపల్లి గ్రామస్తుల ధర్నా

గజ్వేల్, నవంబర్1: గ్రామంలోని ప్రభు త్వ భూమిని కబ్జా చేయడంతోపాటు తమపైనే బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ సిద్దిపేట జిల్లా ములుగు మండలం లక్ష్మక్కపల్లి గ్రామస్తులు ధర్నాకు దిగారు. రాజీవ్ రహదారిని ఆనుకుని ఉన్న ములుగు మం డలం లక్ష్మక్కపల్లి గ్రామానికి చెందిన సర్వే నంబర్ 107లోని 20 గుంటల భూమి కబ్జా కు గురైందని..

భూమిని కాపాడాలం టూ శుక్రవారం గ్రామస్తులు రాజీవ్ రహదారిపై ధర్నా నిర్వహించారు. 20 గుంటల భూమిని మాజీ కలెక్టర్ వెంకట్రాంరెడ్డి అండదండలతో క్షీరసాగర్ గ్రామానికి చెందిన కొన్యాల బాల్‌రెడ్డి, మురళీధర్‌రెడ్డి మరికొంతమందితో కలిసి పట్టా భూమిలో హోటళ్ల నిర్మా ణం చేసుకుని దానికి ఆనుకొని ఉన్న ప్రభు త్వ స్థలాన్ని కబ్జా చేశారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ విషయమై పలుమార్లు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని వారు వాపోయారు. గతంలో ఇదే స్థలంలో గ్రామ పంచాయతీ నర్సరీ ఉండగా గ్రామస్తులను బెదిరింపులకు గురిచేసి నర్సరీని తొలగించారని, అదే విధం గా ఈ హోటళ్ల నుంచి వచ్చే వ్యర్థాలను సైతం యథేచ్ఛగా గ్రామ పంచాయతీ డ్రైనేజీకి కలిపారన్నారు. సంబంధిత అధికారులు కబ్జాకు గురైన స్థలాన్ని కాపాడాలని వారు కోరారు.