calender_icon.png 14 March, 2025 | 1:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని రక్షించండి

13-03-2025 12:00:00 AM

పట్టాగా మారిన నిషిద్ధ ప్రభుత్వ భూమి 

తహసీల్దార్ హెచ్చరిక బోర్డు సైతం ఊడబెరికిన కబ్జాకోర్లు 

విలేకరుల సమావేశంలో పూర్వవిద్యార్థులు, గ్రామస్తుల ఆరోపణ 

నిజామాబాద్, మార్చి 12 (విజయక్రాంతి) : నిజామాబాద్ జిల్లా శివారులోని మోపాల్ మండలం బోర్గాం పి గ్రామంలోని సర్వే నంబరు 586 లోని రెండెకరాల 28 గుంటల శిఖం భూమి పాఠశాలను ఆనుకొని ఉందని  ఆ భూమిని ప్రోబిటేడ్  జాబితాలో ఉన్న ఉన్నప్పటికీని పాఠశాలకు చెందినదిగా చెబుతున్న  భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు 586 సర్వే నెంబర్ గల ఒక ఎకరం 21 గుంటల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి చదును చేసి చేసి వెంచర్లు వేసి రూ:10 కోట్లకు పైగా విలువ చేసే భూమిని కొల్లగొట్టారని వారు తెలిపారు.నిషిద్ధ భూమిని కబ్జాలకు పాల్పడుతున్నరని బోర్గం జడ్పీహెఎస్ పాఠశాల పూర్వ విద్యార్థులతో పాటు గ్రామస్తులు ఆరోపించారు.

బుధవారం నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల ఆవేశంలో బోర్గానికి చెందిన భత్తుల రవి చిలుక శ్రీనివాస్ జి బ్రహ్మయ్య ఎం భాస్కర్ డి రాజమల్లు సిహె చరణ్ తదితరులు ఆరోపించారు. ఈ భూకబ్జా విషయమై ప్రశ్నించిన తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తమను నీడ ల వెంటాడు తున్నారని తమకు గాని తమ కుటుంబాలకు గాని ఏమైనా హాని జరిగితే భూ కబ్జాకు పాల్పడిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు సందగిరి భూమారెడ్డి మల్రాజు రతన్ రావు సందగిరి రాజశేఖర్ రెడ్డి వారి అనుచరులే బాధ్యులని బాధ్యులని బత్తుల రవి చిలుక శ్రీనివాస్ గుంట బ్రహ్మయ్య ఎం భాస్కర్ డి రాజమల్లు చరణ్ ఆర్ ఆంజనేయులు ఆవేదనతో తెలిపారు.

బోర్గం పి శివలోగల సర్వేనెంబర్ 586/1. 586/2 గల భూమిని ఆక్రమించుట చర్చ నేరమని ఆక్రమణకు పాల్పడిన వారు శిక్ష ఆరులని మోపాల్ తహసీల్దార్ ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులు సైతం కబ్జాకోరులో ధ్వంసం చేసి తొలగించారని వారు ఆరోపించారు. ఈ విషయమై జిల్లా పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేయడం  తో పాటు జిల్లా న్యాయస్థానంలో కూడా బుధవారం ఫిర్యాదు చేసినట్టు వారు తెలిపారు.  భూ కబ్జాదారులు స్వప్రయోజనాల కోసం విలువైన ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ప్రభుత్వ భూములను కొల్లగొట్టి పట్టా భూములుగా మార్చి కోట్లు వెనకేసుకుంటున్నారని వారు ఆరోపించారు.

అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారి జిల్లా యంత్రాంగాన్ని కోరారు. కొందరు అవినీతి అధికారులు అక్రమ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు వంత పలుకుతూ వారు అడిగిన పని చేసి పెడుతూ డబ్బులు దండుకుంటున్నారని వారు ఆరోపించారు ఫలితంగా భూ కబ్జాదారులు తమ పథకాన్ని సులువుగా అమలు చేయడాని కై కబ్జా స్థలంలో ఏడు గుంటల భూమిని రోడ్డుగా చిత్రీకరించరని వారు తెలిపారు.గతంలో జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల వార్షికోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ పాఠశాలకు చెందిన భూమిని ఎవరైనా కబ్జాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సభాముఖంగా హెచ్చరించారు.

సంబంధిత అధికారులకు కూడా ప్రభుత్వ పాఠశాల భూమి కాకుండా రెవెన్యూ అధికారులు తాసిల్దారు చర్యలు తీసుకోవాలని సూచిక బోర్డు ఏర్పాటు చేయాలని సూచించడంతో అధికారులు సూచిక బోర్డు ఏర్పాటు చేశారు అని వారు తెలిపారు. ఇది ఇలా ఉండగా భూ కబ్జాదారులు మాత్రం తాసిల్దార్ ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డును భూ వివరాలను సర్వే నెంబర్లను సైతం తొలగించారు. ప్రభుత్వ అధికారుల రెవెన్యూ అధికారుల అలసత్వం వల్ల విలువైన ప్రభుత్వ భూములను  కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ పాఠశాలకు అనుకొని ఉన్న  పాఠశాల భూమి గా రికార్డుల్లో ఉన్న భూమి ఒక ఎకరం 21 గుంటల స్థలాన్ని పాఠశాల జడ్పీహెఎస్ క్రీడా ప్రాంగణానికి ఇప్పించి ఆ క్రీడా మైదానానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని వారు జిల్లా ప్రభుత్వ అధికారులను కోరారు. కబ్జాదారుల చెరలో ఉన్న భూమిని రక్షించడానికి పోరాటం చేస్తున్న పూర్వ విద్యార్థులను గ్రామస్తులను ఫోన్లు చేసి భూకబ్జా ముఠా తాలూకు మనుషులు బెదిరిస్తున్నారని  మరి కొందరితో ప్రత్యక్షంగాను  బెదిరింపులకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు.

విలువైన భూమిని కొట్టేయడానికి ప్రయత్నిస్తున్న వారిని అడ్డు కుంటున్నా మన్న కారణంతో కిరాయి హంతకులతో తమను అంతం చేయాలని చూస్తున్నారని వారు వాపోయారు. తాము నివసిస్తున్న ప్రాంతాల్లో గత కొద్ది రోజులుగా గుర్తుతెలియని కొత్త ముఖాలు తమను అను సరిస్తూన్నారని వారు తెలిపారు.ఈ విషయమై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడంలేదని జిల్లా లోని కొందరు అధికారులు భూకబ్జా దారులకే వత్తాసు పలుకు ఉన్నారని ఆరోపించారు.