calender_icon.png 21 February, 2025 | 9:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ భూమిని కాపాడండి

18-02-2025 12:07:32 AM

రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన తట్టి అన్నారం గ్రామస్థులు

అబ్దుల్లాపూర్‌మెట్, ఫిబ్రవరి 17: ప్రభుత్వ ప్రభుత్వ భూములను కాపాడాలని తట్టి అన్నారం గ్రామస్తులు అన్నారు. పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీ తట్టిఅన్నారం గ్రామ సర్వే నెంబర్ 127/1 ప్రభుత్వ భూమిలో కొంత మంది అక్రమార్కులు అక్రమ ప్లాట్లు చేసి అమ్మేస్తున్నారని...

వారిపై కఠన చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రజావాణిలో యూఎల్ సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్  శ్రీనివాస్ రెడ్డికి  ఫిర్యాదు చేసిన్నట్లు తెలిపారు. అనంతరం తట్టి అన్నారం గ్రామస్తులు మాట్లాడుతూ...

రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తట్టి అన్నారం గ్రామ సర్వే నెంబర్  127/1లో గల  ప్రభుత్వ భూమిలో కొంత మంది ఇదే గ్రామానికి చెందిన దేవిడి ఆశిరెడ్డి, సత్తిరెడ్డి, అనసూ యమ్మ, వెంకటరెడ్డి, చంద్రారెడ్డి, పెంటారెడ్డి, మాధవరెడ్డి, నర్సింహారెడ్డి, రవీందర్‌రెడ్డి, లోహిత్ రెడ్డి, సురేందర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, సంజీవరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, ప్రభాకర్‌లు వీరందరూ కలిసి దేవిడి మాలతి భర్త సురేందర్‌రెడ్డి సేల్‌డీడ్ చేసినట్లు తెలిపారు.

తట్టి అన్నారం చౌరస్తా మెయిన్ రోడ్డు, సర్వే నెంబర్ 127/1, 127/3లలో మాలతి, సురేందర్‌రెడ్డి అమ్మిన ప్లాటు నెంబర్ 31 విస్తీర్ణం 817 గజాలు, ప్లాటు నెం. 40, 41 విస్తీర్ణం 596లు, 127/3 నిషేధిత జాబితలో ఉండడం వలన నోటరీ పద్దతి ద్వారా విక్రయాలు జరిపారు.  సర్వే నెంబర్ 127/1లో సర్వే నెంబర్ 127/3 పేరుతో ప్లాట్లుగా చేసి పంచుకొని అమ్మిన దేవిడి మాలతి భర్త సురేందర్‌రెడ్డి చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.

“తల పాపం.. తిల పిడికెడు అన్నట్లుప్రభుత్వ భూమిని తల ఇంత పంచుకొని ప్లాట్లుగా చేసి.. నోటీరీల ద్వారా విక్రయిస్తున్నారని తెలిపారు. 127/1, 127/2, 127/3 సర్వే నెంబర్‌లలో 5 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందన్నారు. ఈ భూమి యొక్క విలువ దాదాపు రూ. 100 కోట్లు ఉంటుందన్నారు. గతంలో రెవెన్యూ అధికారులు సర్వే చేసి బౌండీస్ కూడా పెట్టారు.

అయిన అక్రమార్కులు ఆ బౌండీ స్‌ను తొలగించి విక్రయాలు జరుపుగుతు న్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసి మండల రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.

ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి అక్రమార్కులకు పాల్పడిన వారిపై చట్టపరమైన కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ నల్ల ప్రభాకర్ మస్క శ్రీనివాస్, డీ మునీందర్‌రెడ్డి, సుక్క రవికుమార్ తట్టిఅన్నారం గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.