calender_icon.png 5 February, 2025 | 12:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ భూమిని కాపాడండి

30-01-2025 12:00:00 AM

తహసీల్దార్ కార్యాలయం ఎదుట జిన్నారం గ్రామస్తుల ఆందోళన 

పటాన్ చెరు, జనవరి 29 : జిన్నారం మండల కేంద్రంలో సర్వే నెంబర్ 1 లోని ప్రభుత్వ భూమిని కాపాడాలని  పలువురు గ్రామస్తులు రెవెన్యూ అధికారులను కోరారు. ఈ మేరకు సర్వేనెంబర్ 1 లోని ప్రభుత్వ భూమిని సర్వే చేసి హద్దులు నిర్ధారించాలని డిమాండ్ చేస్తూ బుధవారం తహసిల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. సర్వే నెంబర్ 58లో ఉన్న పట్టాదారులు రోడ్డు దాటి ప్రభుత్వ భూముల్లోకి వచ్చి హద్దులు పాతారని రెవెన్యూ అధికారు లకు తెలిపారు.

సమస్యను పరిష్కరించాలని గత కొన్ని రోజులుగా రెవెన్యూ అధికారులను కోరుతున్న పట్టించుకోవడంలేదని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ భూమిని కాపాడాలం టూ రెవెన్యూ కార్యాలయం ఎదుట బైఠాయించి  నినాదాలు చేశారు. సర్వే నంబర్ 1 లోని తాబేలు గుట్టపై శివాలయం నిర్మిస్తున్నామని, భూమిని సర్వే చేసి హద్దులు నిర్దారించాలని కోరుతూ డిప్యూటీ తహసిల్దార్ మల్లికార్జున స్వామికి వినతి పత్రాన్ని అందజేశారు.