11-12-2024 02:03:51 AM
ఎల్బీనగర్, డిసెంబర్ 10 : ‘స్పా’ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టును చైతన్యపురి పోలీసులు రట్టు చేశారు. నాగోల్‌లోని గోల్డెన్ విల్లాలో ఉంటున్న శ్రీకాంత్‌రెడ్డి చైతన్యపురి పోలీస్‌స్టేషన్ పరిధిలోని నాగోల్ ఎక్స్ రోడ్డులో భరత్ పెట్రోల్ పంపు ఎదురుగా స్పానిష్ స్పా సెలూన్ ఏర్పాటు చేశాడు. అధిక ఆదాయం కోసం స్పా సెలూన్‌ను వ్యభిచార కేంద్రంగా మార్చాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు స్పానిస్ స్పా సెలూన్‌పై మంగళ వారం దాడిచేసి, 8మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. విటుడితోపాటు నిర్వాహకుడిని అరెస్టు చేశారు.