హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 23(విజయక్రాంతి) : స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ బ్యూటీ సెలూన్‌పై వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడిచేసి ముగ్గురు విఠులను అరెస్టు చేయడంతో పాటు యువతులను వారిచెరనుంచి కాపాడారు.
నగరంలోని మాసబ్‌ట్యాంక్ ప్రాంతంలో సందర్శిని హోటల్ ఎదురుగా గల అమేజింగ్ బ్యూటీ సెలూన్ స్పాసెంటర్లో కొన్నేళ్లుగా వ్యభిచార గృహాన్ని నడుపుతున్నట్లు పక్కా సమాచారం మేరకు శనివారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఈ దాడుల్లో స్పా సెంటర్ నిర్వాహకులు యాజాలి ప్రకాశ్, మేదరి కవితతో పాటు విఠుడు షేక్ ఫైసల్ని అరెస్ట్ చేశారు. ఈ దాడు ల్లో నలుగురు యువతులను రక్షించారు.
టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ జంగ య్య ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. నిత్ర జాబ్స్ సెర్చ్ యాప్ తెలు గు, లోకల్ బ్రేకింగ్ ఇన్ఫో జాబ్స్ పేరిట యువతులకు రూ.20 నుంచి 25 వేల జీతం ఇస్తామని నమ్మించి.. తాముచెప్పినట్లు చేస్తే నెలకు రూ.50 వేలు వరకు సంపాదించుకోవచ్చని ఆశజూపి స్పానిర్వాహకులు యువతులను వ్యభిచారం లోకి దింపుతున్నట్లు గుర్తించారు.