calender_icon.png 15 January, 2025 | 5:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం

08-08-2024 10:02:02 PM

పోలీసులకు పట్టుబడ్డ నలుగురు యువతులు, ఒక విటుడు

హైదరాబాద్: నగరం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించి, పట్టుబడిన వారిని జైలుకు తరలిస్తున్న కొందరిలో మార్పు రావడం లేదు. తాజాగా స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ స్పా సెంటర్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. హబ్సిగూడలో రాయల్ స్పా సెంటర్‌లో నిబంధనలకు విరుద్ధంగా అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు గురువారం తనిఖీలు నిర్వహించారు.

ఈ తనిఖీలలో నలుగురు యువతులతో పాటు ఒక విటుడిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి, స్పా సెంటర్‌ను సీజ్ చేశారు. రాయల్ స్పా సెంటర్ నిర్వాహకుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. పట్టుబడిన యువతులను ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్‌కు తరలించి, కేసు నమోదు చేసి అనంతరం నలుగురు యువతులను తార్నాక హోమ్‌కు తరలించారు. నిబంధనలకు విరుద్ధంగా స్పా సెంటర్లను నడిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.