లొకాంటో ఆన్‌లైన్ సర్వీస్ పేరుతో వల
పోలీసుల అదుపులో ఇద్దరు ఉంగాండా యువతులు
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 1(విజయక్రాంతి): తార్నాక నాగార్జున నగర్‌లోని ఒక ఇంట్లో వ్యభిచారం జరుగుతు న్నట్లు వచ్చిన సమాచారంతో హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ బృందం, ఉస్మానియా వర్సిటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఇద్దరు నిర్వాహకులతో పాటు ఓ విటుడిని అదుపులోకి తీసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ వైవీఎస్ సుధీంద్ర తెలిపిన వివరాల ప్రకారం ఉగాండాకు చెందిన నయెబరె డొరీన్ అనే మహిళ నాలుగు నెలల కింద నాగార్జున నగర్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుంది.
ఉగాండాకే చెందిన కొముహంగి రిత అనే యువతితో కలిసి వ్యభిచారగృహాన్ని నడుపుతోంది. లోకాంటో అనే ఆన్‌లైన్ సర్వీస్‌లో ఆమె నంబర్‌ను అప్‌లోడ్ చేసింది. సికింద్రాబాద్‌లోని ఓ లొకేషన్ పంపి అక్కడికి వచ్చిన కస్టమర్లను ఇంటికి తీసుకెళ్లేవారు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించి నయెబరె డొరీన్, కొముహంగి రితలతో పాటు ఉప్పల్‌కు చెందిన పొట్టూరి అంజన్‌కుమర్ అనే విటుడిని అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేశారు.