19-04-2025 10:18:47 AM
ఉద్యోగాల కోసం హైదరాబాద్ వచ్చిన యువతులతో వ్యభిచారం
హైదరాబాద్: సికింద్రాబాద్ పరిధిలోని రాంగోపాల్ పేట పరిధి(Ramgopalpet area)లో వ్యభిచార ముఠా గుట్టురట్టు అయింది. బాపుబాగ్ కాలనీలోని ఓ ఇంట్లో ముఠా వ్యభిచారం నిర్వహిస్తోంది. ఉద్యోగాల కోసం హైదరాబాద్ వచ్చిన అమాయక యువతులతో వ్యభిచారం చేస్తున్నారు. యువతులను స్వప్న అనే మహిళ వ్యభిచారంలోకి దింపుతున్నట్లు గుర్తించారు. విశ్వసనీయ వర్గాల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ముఠాలోని మహమ్మద్ అవియాజ్, హుస్సేన్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న లడ్డు, స్వప్న కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ఇద్దరు యువతులను వ్యభిచార గృహం నుంచి పోలీసులు రక్షణ కల్పించారు.