23-03-2025 12:04:25 AM
శ్రీ శ్రీనివాస కిడ్నీ సెంటర్ వైద్యుడు, యూరాలజిస్ట్ రాంప్రసాద్‌రెడ్డి
హైదరాబాద్, మార్చి 22 (విజయక్రాం తి): ప్రోస్ట్రేట్ గ్రంధి వాపుతో వచ్చిన ఇద్దరు వృద్ధ రోగులకు అత్యాధునిక పద్ధతిలో ప్రోస్టేజ్ శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించామని శ్రీ శ్రీనివాస కిడ్నీ సెంటర్ వైద్యుడు, యూరాలజిస్ట్ రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 21న ఇద్దరు 70 సంవత్సరాల వయసు గల వృద్ధులు తమ ఆసుపత్రి కి రాగా ప్రోస్ట్రేట్ గాంధీ వాపు ఉందని నిర్ధారించామన్నారు.
అదే రోజు రెసుమ్ అనే విధానంతో రోస్ట్ రైడ్‌కు శస్త్ర చికిత్స చేసి అదే రోజు డిశ్చార్జ్ చేసినట్టు తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌లోని రెండు ఆసుపత్రుల్లో మాత్రమే ఈ తరహా శస్త్ర చికిత్స నిర్వహిస్తున్నారని తెలిపారు. కోటి రూపాయల విలువ చేసే పరికరంతో కేవలం మూడు నిమిషాల్లో శస్త్ర చికిత్స చేసి రోగులను డిశ్చార్జ్ చేశామని తెలిపారు. ఇద్దరు వృద్ధ రోగులు కూడా సంతోషం వ్యక్తం చేశారని చెప్పారు. ఈ ఆపరేషన్‌లో డాక్టర్ ప్రభురామ్, డాక్టర్ సామ్రాట్ పాల్గొన్నట్లు రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.