calender_icon.png 1 April, 2025 | 12:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ రహదారి కోసం ప్రతిపాదించండి

26-03-2025 04:47:42 PM

భైంసా (విజయక్రాంతి): ముధోల్ నియోజకవర్గంలోని బాసర పుణ్యక్షేత్రం నుంచి మహారాష్ట్రలోని మాహూర్ రేణుకా మాత ఆలయం వరకు 70 కిలోమీటర్ల నిడివి గల మార్గానికి జాతీయ రహదారిగా అభివృద్ధి చేయాలని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ విజ్ఞప్తి చేశారు. శాసనసభ సమావేశాల్లో బుధవారం పాల్గొన్న ఆయన మన సమస్యలపై ప్రస్తావించారు. బాసర నుంచి బైంసా మార్గం గుండా మహారాష్ట్రలోని రేణుకా మాత దత్తాత్రి టెంపుల్ వరకు బైంసాకు మీదుగా  నిర్మాణంలో ఉన్న 166బిబి జాతీయ రహదారిని మహోర్ వరకు పొడిగించాలని కోరారు. ఈ విషయాన్ని గతంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి వివరించగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు పంపేలా సూచించారని గుర్తు చేశారు.