calender_icon.png 19 September, 2024 | 7:05 AM

ప్రాజెక్టుల మరమ్మతులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి

27-07-2024 01:56:22 AM

నీటిపారుదలశాఖ చీఫ్ ఇంజినీర్ ధర్మ

నారింజ ప్రాజెక్టు, బొగ్గులంపల్లి ఎత్తిపోతల పథకం పరిశీలన

సంగారెడ్డి, జూలై 26 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల మరమ్మతులు చేసి, సాగునీటి కాల్వలకు లైనింగ్ పనులు చేసేందుకు ప్రాధాన్యమిస్తున్నదని సంగారెడ్డి నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ ధర్మ తెలిపారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లాలోని నారింజ ప్రాజెక్టుతో పాటు ఎత్తిపోతల పథకం, పలు చెరువులను పరిశీలించారు. ప్రాజెక్టుల మరమ్మతులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. లీకేజీలు కాకుండా మరమ్మతులు చేసేందుకు చర్యలు తీసుకోవాల న్నారు.

రాయికోడ్ మండలంలోని బొగ్గులంపల్లి ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించి పెం డింగ్‌లో ఉన్న పనులు వేగంగా పూర్తి చేయలన్నారు. ఝరాసంగం మండలంలోని ఏడా కులపల్లి చెరువును, జహీరాబాద్ మండలంలోని కొత్తూర్(బి) గ్రామంలో ఉన్న నారింజ ప్రాజెక్టును పరిశీలించారు. ఆయనవెంట సంగారెడ్డి నీటిపారుదల శాఖ ఎస్‌ఈ యేసయ్య, జహీరాబాద్ ఈఈ విజయ్‌కుమార్, డీఈఈలు ఉదయ్‌బాస్కర్, జనార్ధన్, వెంకట్‌రెడ్డి, ఏఈ జానకిరాం ఉన్నారు.