calender_icon.png 6 March, 2025 | 9:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సదరం క్యాంపుల నిర్వహణకు ప్రతిపాదనలు వెంటనే సమర్పించాలి

06-03-2025 12:03:22 AM

జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

కామారెడ్డి, మార్చి 5,(విజయక్రాంతి): జిల్లాలో సదరం క్యాంపుల నిర్వహణకు కావలసిన మౌళిక సదుపాయాలు, అవసరమైన పరికరాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో వైద్య ఆరోగ్య శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇటీవల సంబంధిత అధికారులతో సేర్ప్ సి.ఈ.ఒ. నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్ లో సూచించిన ప్రకారంగా, జిల్లాలో సదరం క్యాంపుల నిర్వహణకు అవసరమైన కావలసిన పరికరాలు, మిషనరీ, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తెలిపారు.

అట్టి పూర్తి ప్రతిపాదనలు వెంటనే సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఫరీదా బేగం, జిల్లా ఆసుపత్రి కో ఆర్డినేటర్ విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.