జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
పెద్దపల్లి(విజయక్రాంతి) : సుల్తానాబాద్ లో నూతన ఇసుక రీచ్ ఆప్రోచ్ రొడ్డు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులను అదేశించారు. మంగళవారం సుల్తానాబాద్ మండలంలో విస్తృతంగా పర్యటించి ప్రభుత్వ పాఠశాలలు, నూతన ఇసుక రీచ్, తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు.
మండలంలోని నీరుకుల్లా గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను,
గట్టేపల్లి గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడి కేంద్రాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని, వారికి నాణ్యమైన ఆహారం అందించాలన్నారు.
అవెన్యూ ప్లాంటేషన్ ను కలెక్టర్ పరిశీలించారు.
మండలంలోని నీరుకుల, గట్టెపల్లి గ్రామాలలో నూతనంగా ఏర్పాటు చేయబోయే ఇసుక రీచ్ లను కలెక్టర్ తనిఖీ చేశారు. ఇసుక రీచ్ లకు అవసరమైన అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలన్నారు.
అనంతరం మండల తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి పెండింగ్ దరఖాస్తుల వివరాలు తెలుసుకున్నారు. ఆయన వెంట తహసిల్దార్ మధుసూదన్ రెడ్డి, ఎంపీడీవో సంబంధిత అధికారులు, పాల్గొన్నారు.