పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్
హైదరాబాద్, సెప్టెంబర్ 15( విజయక్రాంతి: మహ్మద్ ప్రవక్త జన్మదినోత్సవమైన మిలాద్ ఉన్ నబీ ముస్లింలకు అత్యంత పవిత్రమైన పండుగ అని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా ముస్లింలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ప్రవక్త బోధనలు ప్రపంచ శాంతికి, సోదర భావానికి, ప్రేమకు మార్గమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ లౌకికవాద సిద్ధాంతాలతో పనిచేస్తుందని పేర్కొన్నారు. దేశం, మత సామరస్యంతో ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటుందని తెలిపారు.