28-02-2025 12:22:06 AM
నలుగురు నిందితుల అరెస్టు
వివరాలు వెల్లడించిన శంషాబాద్ డీసీపీ రాజేష్
రాజేంద్రనగర్ ఫిబ్రవరి 27 (విజయ క్రాంతి): చోరీ కేసులో శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి 20 లక్షల నగదు స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించారు. కేసు వివరాలను గురువారం సాయంత్రం శంషాబాద్ లోని తన కార్యాలయంలో డీసీపీ రాజేష్.. ఏసీపీ శ్రీనివాసరావు, ఇన్స్పెక్టర్ బాలరాజు తో కలిసి కేసు వివరాలు వెల్లడించారు. ఫిబ్రవరి 11వ తేదీన 6 గంటలకు ఎయిర్పోర్టులోని బ్యుమర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన పవన్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
జిఎంఆర్ ఎరీనాలోని తమ కంపెనీ గోదాం నుంచి 20 లక్షల విలువైన కాపర్ పవర్ కంట్రోల్ కేబుల్ ను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సెక్యూరిటీ గారడ్స్ చోరీ చేశారని అనుమానం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. గురువారం నలు గురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి 20 లక్షల నగదు, బొలెరో వాహనం, అదేవిధంగా 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
చోరీ సొత్తును నిందితులు విక్రయించగా వచ్చిన డబ్బులను స్వాధీనం చేసుకున్నట్లు డిసిపి రాజేష్ పేర్కొన్నారు. చోరీ కేసులో మొత్తం ఏడు మంది పాల్గొన్నారని, అందులో నలుగురిని చేసినట్లు వివరించారు. ఆదిళ్ల శ్రీకాంత్, కేతావత్ భాష, అబ్దుల్ వహేద్, మధు ఖాదర్ ఖాన్ ను అరెస్టు చేసీ రిమాండ్ కు తరలించారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. కేసును చాకచక్యంగా పోలీసులను ఈ సందర్భంగా డిసిపి ప్రత్యేకంగా అభినందించారు.