calender_icon.png 25 February, 2025 | 8:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాపర్టి టాక్స్ కలెక్షన్ 100 శాతం పూర్తి చేయాలి

25-02-2025 06:00:40 PM

కరీంనగర్ (విజయక్రాంతి): ప్రాపర్టి టాక్స్ కలెక్షన్ 100 శాతం టార్గెట్ ను పూర్తి చేయాలని కమీషనర్ చాహాత్ బాజ్ పాయ్ అధికారులను ఆదేశించారు. కరీంనగర్ నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో డిప్యూటీ కమీషనర్ స్వరూప రాణీతో కలిసి కమీషనర్ చాహాత్ బాజ్ పాయ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. డివిజన్ల వారిగా నియమించిన వార్డు ఆఫీసర్లు, సపోర్టింగ్ స్టాఫ్, రెవెన్యూ విభాగం చెందిన రెవెన్యూ ఇన్ స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లతో సమీక్షించారు. సమావేశంలో ఆస్తిపన్నుల వసూళ్లు, ట్రేడ్ లైసెన్స్ లు వాటి పన్నులు, నగరపాలక సంస్థ దుకాణాల రెంటులు, మెండి బకాయి దారులు, అసెస్మెంట్లు తదితర అంశాల పై సుదీర్ఘంగా చర్చించారు.

సంబంధిత అంశాల పై అధికారులకు సలహాలు సూచనలు చేస్తూ... ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమీషనర్ చాహాత్ బాజ్ పాయ్ మాట్లాడుతూ.... ఆస్తి పన్నుల వసూళ్లలో ఇంకా ఇంప్రూవ్ చేసి...నగరపాలక సంస్థ ఆదాయంను పెచ్చాలన్నారు. సమయం చాలా తక్కువగా ఉండి కాబట్టి ప్రాపర్టి టాక్స్ కలెక్షన్ లో వేగం పెంచి... చార్గెట్ ప్రకారం వంద శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. సెలవు దినాల్లో కూడ ప్రాపర్టి టాక్స్ కలెక్షన్ చేయాలని కోరారు. డీవిజన్ లలో అవసరాన్ని బట్టి ఆస్తి పన్నుల వసూళ్లకు క్యాంపు లాగా కండక్ట్ చేయాలన్నారు. హోటల్స్, రెస్టారెంట్లు, సినిమా హాల్స్, హాస్పిటల్స్, ఇతర ప్రైవేటు సంస్థలతొ పాటు ప్రభుత్వ సంస్థల పన్నులను కూడ తప్పక వసూళ్లు చేయాలన్నారు.

మొండి బాకాయి దారుల పై మరింత ఒత్తిడి తేవాలన్నారు. డివిజన్ వారిగా బకాయి దారుల పేర్లను అనౌన్స్ చేయాలని ఆదేశించారు. డిఫాల్టర్స్ కోసం నగరపాలక సంస్థ లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి లిస్టు ఆధారంగా కాల్స్ చేసి పన్నులు కట్టించేలా చర్యలు తీస్కోవాలని కోరారు. రెవెన్యూ సెక్షన్స్ లో ఉద్యోగులు మ్యూటేషన్ ఫైల్స్ పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు క్లీయర్ చేయాలన్నారు. ఫైల్స్ నెలల తరబడి పెండింగ్ పెడితే సంబంధిత అధికారుల పై చర్యలు తీస్కుంటామని హెచ్చరించారు. అంతే కాకుండా వార్డు ఆఫీసర్లు కొత్త ట్రేడ్ లైసెన్స్ కట్టించేలా చర్యలు తీస్కోవాలన్నారు. ట్రేడ్ లైసెన్స్ పన్నులను కూడ టార్గెట్ ప్రకారం వసూలు చేయాలని కోరారు. కొత్త ట్రేడ్ లైసెన్స్ కట్టించే సమయంలో పాత టిన్ నెంబర్ ఉందా లేదా తనిఖీ చేసి టిన్ నెంబర్ ఉంటే ఆలాంటి వాటి లైసెన్స్ రెన్యూవల్ చేయాలని కోరారు.

పాత స్ట్రక్చర్ కూల్చి... ఆ ప్రదేశాల్లో కొత్త భవనాలు నిర్మాణం చేసే సమయంలో పాత స్ట్రక్చర్ పన్నులు పూర్తిగా చెల్లిస్తేనే కొత్త భవనానికి అనుమతులు ఇవ్వాలని ఆదేశించారు. అలాంటి వాటికి డబుల్ అసెస్మెంట్లు ఉండటంతో డిమాండ్ అధికంగా చూపిస్తుందని... అలాంటివి ఉంటే పాత అసెస్మెంట్లు మీద పన్నులు పూర్తిగా కట్టించి... పాత అసెస్మెంట్ నెంబర్ తొలగించాలన్నారు. బైఫర్ కేషన్ దరఖాస్తులకు ఫీల్డ్ విజిట్ కు వెల్లే సమయంలో ఆర్ ఐలు వార్డు ఆఫీసర్లను వెంట తీస్కెల్లాలని ఆదేశించారు. నగరపాలక సంస్థ 100 శాతం ప్రాపర్టీ టాక్స్ కలెక్షన్ టార్గెట్ పూర్తి చేసి... నగరపాలక సంస్థ అభివృద్ధి కి కృషి చేయాలన్నారు. నగర ప్రజలు మీ పన్నులను సకాలంలో చెల్లించి... బారం తగ్గించుకోవాలని పిలుపు నిచ్చారు. పన్నులు పూర్తి స్థాయిలో నగరపాలక సంస్థ చెల్లించి అభివృద్ధి కి సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ లు, వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు పాల్గొన్నారు.