calender_icon.png 19 February, 2025 | 10:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వంద శాతం పన్ను వసూలు చేపట్టాలి

15-02-2025 08:23:38 PM

కాగజ్ నగర్,(విజయక్రాంతి): ఆస్తి పన్ను బకాయిలను త్వరితగతిన వంద శాతం వసూలు చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అధికారులను ఆదేశించారు. కాగజ్ నగర్ పట్టణంలోని ఇందిరా మార్కెట్, పెట్రోల్ పంప్ ప్రాంతాల్లో ఆస్తి పన్ను వసూలును  పర్యవేక్షించారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఆస్తి పన్ను వివరాలను కమిషనర్ అంజయ్య, రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ... ఈ ఏడాది మున్సిపల్  పరిధిలోనీ 30 వార్డులలో రూ రూ.3.92 కొట్ల ఆస్తి పన్ను వసూలు లక్ష్యం పెట్టుకోగా ఇప్పటివరకు రూ.1.80 కోట్లు (46% శాతం) చెయ్యగా రూ.2.12 కోట్లు పన్ను వసూలు కావాల్సి ఉందని తెలిపారు. పన్ను చెల్లింపునకు మార్చి 31 గడువులోగా పన్ను చెల్లించేలా ప్రజలను చైతన్యపరిచి లక్ష్యం పూర్తి చేయాలని అధికారులను అదేశించారు. ఈ కార్యక్రమంలో కమీషనర్ అంజయ్య, మేనేజర్ పెద్దింటి క్రాంతి, రెవెన్యూ అధికారి రాజేందర్, జూనియర్ అసిస్టెంట్ సుధాకర్ సిబ్బంది ఉన్నారు.