calender_icon.png 17 March, 2025 | 2:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆస్తిపన్ను బకాయిలు రూ.22 కోట్లు

17-03-2025 01:52:10 AM

 రెడ్ నోటీసులు జారీ

 పన్ను చెల్లించకపోతే నీటి కనెక్షన్ బంద్

 స్వయంగా రంగంలోకి దిగిన కమిషనర్

కరీంనగర్, మార్చి 16 (విజయక్రాంతి): కరీంనగర్ నగరపాలక సంస్థకు సంబంధించి ఆస్తిపన్నుల బకాయిలు పేరుకుపోయాయి. నెల రోజుల నుండి విస్తృతంగా పన్ను చెల్లింపుపై ప్రచారం నిర్వహిస్తున్నా ఇప్పటి వరకు 56 శాతానికిపైగా ఆస్తి పన్ను చెల్లింపులు జరిగాయి. ఇంకా 22 కోట్ల రూపాయల మొండి బకాయిలు రావాల్సి ఉంది. మూడు, నాలు గు సంవత్సరాల నుండి రైస్ మిల్లర్లు, ప్రైవేట్ సంస్థలు, ప్రభుత్వ సంస్థలు ఆస్తి పన్ను బకాయి పడడంతో భారీగా పేరుకుపోయా యి. క్రమం తప్పకుండా ఆస్తి పన్ను చెల్లిస్తున్నవారు మినహా మొండి బకాయిదారులు ముందుకు రాకపోవడంతో నగరపాలక సం స్థ రెడ్ నోటీసులు జారీ చేసింది. ఆస్తి పన్ను గడువులోగా చెల్లించకుంటే మున్సిపల్ సేవలతోపాటు నీటి సరఫరా నిలిపివేస్తామని తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. కరీంనగర్ నగరపాలక సంస్థ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ సెలవు దినమైన ఆదివారం కూడా స్వయంగా రంగంలోకి దిగి మొండి బకాయిదారులకు నోటీసులు జారీ చేశారు.

మొండి బకాయిదారుల నివాస గృహాలను సందర్శించి గత కొద్ది రోజులుగా నగరపాలక సంస్థకు ఆస్తి పన్నులు చెల్లించని బకాయిదారుల నుంచి పన్నులు కట్టించారు. నగరంలోని రాంనగర్ లిటిల్ పార్కుతోపాటు మార్కెట్ రోడ్డులోని పలు లార్జీలు, కమర్షియల్ షాపులను సందర్శించి మొండిబకాయిదారులను పన్నులు చెల్లించాలని డిమాండ్ చేశారు. రెడ్ నోటీసులు జారీ చేసి నోటీసు గడువు ముగుస్తున్న లిటిల్ పార్కుకు పన్నులు చెల్లించకపోతే తాళం వేయాలని అధికారులను ఆదేశించారు. మార్కెట్ రోడ్డులోని లక్ పతి కాంప్లెక్స్ కమర్షియల్ షాపులకు తాళం వేయించారు.

సకాలంలో పన్నులు చెల్లించాలి...

- నగరపాలక సంస్థ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్‌నగర ప్రజలు, బకాయిదారులు ఆర్ధిక సంవత్సరం గడువులోగా ఆస్తి పన్ను లు, నల్లా పన్నులు, ట్రేడ్ లైసెన్స్ పన్నులు సకాలంలో చెల్లించి నగపాలక సంస్థ అభివృద్ధికి సహకరించాలి. సకాలంలో పన్నులు చెల్లించని బకాయిదారులపై మున్సిపల్ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం.