11-03-2025 12:00:00 AM
కరీంనగర్, మార్చి 10 (విజయక్రాంతి) : జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన ఆస్తిపన్ను బకాయిలను తప్పనిసరిగా చెల్లించాలని ఆయా శాఖల అధికారులకు కలెక్టర్ పమెల్ల సత్పతి సూచించారు. ప్రజావాణి అనంతరం కలెక్టర్ అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. నిర్దేశిత లక్ష్యం చేరుకోకుంటే ఆర్థిక సంఘం నుంచి వచ్చే నిధుల విషయంలో ఇబ్బంది అవుతుందని పేర్కొన్నారు.
ప్రభుత్వ నిధుల నుంచి నెలాఖరులోగా చెల్లించాలని ఆదేశించారు. జిల్లాలో పెండింగ్ లో ఉన్న ఈజీఎస్ పనులు , ఎస్డీఎఫ్ పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. మండలాల్లో ఎంపీడీవోలు, మునిసిపాలిటీల్లో కమిషనర్లు క్షేత్రస్థాయిలో తనిఖీ చేస్తూ.. పనులు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిర్దేశించిన గడువులోగా జిల్లాలో వ్యవసాయతేర భూ ములను గుర్తించాలని తహసీల్దార్లు, వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.