calender_icon.png 24 October, 2024 | 11:48 AM

సరైన నిద్రకోసం..

04-06-2024 12:05:00 AM

ప్రతీరోజూ ఏడు గంటలు లేదా ఎనిమిది గంటలు నిద్రపోవాలి. ఒకవేళ సరైన నిద్ర లేకపోతే రోజంతా ఏమీ తోచదు. చికాగుగా ఉంటుంది. అంతే కాకుండా చేసే పని మీద ఏకాగ్రత కూడా పెట్టలేకపోతాం. దీంతో ఆరోగ్యం పాడైపోతుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు నిద్రమాత్రలు ఉపయోగిస్తుంటారు. ఇది చాలా ప్రమాదకరమని డాక్లర్లు హెచ్చరిస్తున్నారు. ఎటువంటి మాత్రలు లేకుండా హాయిగా నిద్రపోవడానికి కొన్ని సూచనలను అమలుచేయండి..

  1. రాత్రి పూట టీ, కాఫీలాంటివి తాగకూడదు.. వీటిలో ఉండే కెఫీన్ నిద్ర రాకుండా చేస్తుంది. కాబట్టి కెఫీన్, నికోటిన్ వాడకాన్ని పరిమితం చేయాలి. 
  2. నిద్రపోయే ముందు ఎక్కువగా ఆహారం తినడం మానెయ్యాలి. లేకుంటే అసౌకర్యానికి, అజీర్ణానికి కారణమవుతుంది.
  3. వ్యాయామం ఒత్తిడిని, ఆందోళనను తగ్గిస్తుంది. అంతేకాకుండా నాణ్యమైన నిద్రను ప్రోత్సహిస్తుంది. రాత్రి సమయంలో నిద్రపోయే ముందు తీవ్రమైన వ్యాయామం చేయకుండా ఉండడం మంచిది. పడుకోబోయే ముందు ధ్యానం చేయాలి. దీని వల్ల మనసు            ప్రశాంతంగా మారి శరీరానికి విశ్రాంతినిస్తుంది.
  4. కొందరు అదేపనిగా పగటిపూట ఎక్కువగా నిద్రపోవడం రాత్రి నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. దీంతో నిద్రపోవడం కష్టమవుతుంది. 
  5. ప్రతీరోజూ ఒకే సమయంలో లేవడం.. ఒకే సమయంలో పడుకోవడం అలవాటు చేసుకోవాలి. 
  6. పడుకునే ముందు చదవడం వల్ల, వెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
  7. రాత్రిపూట స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్, టీవీలాంటి ఎలక్ట్రానిక్ వస్తువుల వాడకాన్ని తగ్గించాలి. నిద్రపోయే ముందు వీటిని పక్కన పెట్టాలి.