calender_icon.png 7 February, 2025 | 5:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

108 అంబులెన్స్‌లతో సత్వర సేవలు

09-12-2024 01:03:41 AM

ఎమ్మెల్యే పోచారం 

కామారెడ్డి, డిసెంబర్ 8 (విజయక్రాంతి): అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులకు వైద్య సదుపాయం అందించేందుకు 108 అంబులెన్స్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా పోతంగల్, రద్రుర్, చందూర్ మండలాలకు మంజూరైన 108 అం బులెన్స్‌లను పోచారం శ్రీనివాస్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. సత్వర సేవలు పొందేందుకు 108 అంబులెన్స్‌లు ఎంతో ఉపయోగపడుతున్నా యని తెలిపారు. 108 అంబులెన్స్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమం లో అగ్రో కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాల్‌రాజ్, మండల కాంగ్రెస్ నాయకులు అంజిరెడ్డి, కృష్ణారెడ్డి, నరేష్, సాయిలు పాల్గొన్నారు.