టీఎన్‌జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్
హైదరాబాద్‌సిటీబ్యూరో, నవంబర్ 29(విజయక్రాంతి): పంచాయతీ కార్యదర్శులకు క్యాడర్ స్ట్రెంత్ నిర్ధారణ చేయడంతో పాటు ఖాళీగా ఉన్న పోస్టుల్లో ప్రమోషన్లు కల్పించాలని టీఎన్‌జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్ ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం నాంపల్లిలోని టీఎన్‌జీవోస్ భవన్‌లో జరిగిన తెలంగాణ పంచాయతీ సెక్రటరీ సెంట్రల్ ఫోరమ్ రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజ రై మాట్లాడారు.
2019లో నియామకమైన జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు 2సంవత్సరాల ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని, ఓపీఎస్‌లను జేపీఎస్‌లుగా కన్వర్ట్ చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్‌జీవోస్ కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి ముజీబ్, టీఎన్‌జీవో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు కస్తూరి వెంకటేశ్వర్లు, సత్యనారాయణగౌడ్, కొండల్‌రెడ్డి, టీఎన్‌జీవోస్ ములుగు జిల్లా అధ్యక్షులు పోలు రాజు, పంచాయతీ కార్యదర్శి ఫోరం కార్యదర్శి వెంకటరమణ, అసోసియేట్ అధ్యక్షులు శ్రావణ్, సదానందం, రఫీ, ట్రెజరర్ నిరంజన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వివిధ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.