* టీజీవో సంఘం డిమాండ్
హైదరాబాద్, జనవరి 24 (విజయక్రాంతి): వాణిజ్య పన్నుల శాఖలో పదోన్నతులు కల్పించాలని టీజీవో సంఘం డిమాండ్ చేసింది. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల పట్ల అధికారులు చూపుతు న్న వివక్షకు వ్యతిరేకంగా ఈ నెల 28న నాంపల్లిలోని వాణిజ్యపన్నుల కమిషనర్ కార్యాలయం ఎదుట నల్లబ్యాడ్జీల తో నిరసన కార్యక్రమం చేపడుతున్న ట్టు సంఘం అధ్యక్షుడు కే భిక్యా తెలిపారు.
ఈ మేరకు టీజీవో సంఘం రా ష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, అసోసియేట్ అధక్షుడు బీ శ్యామ్‌ను టీజీవో భవన్‌లో శుక్రవారం కలిసి మద్దతు కోరినట్టు తెలిపారు.