‘అన్‌ఫిట్ ఆఫీసర్ డైరెక్టర్ గిరీ పైరవీ’ కథనంపై ఐఅండ్‌పీఆర్ ఉద్యోగుల సంఘం ఖండన
హైదరాబాద్, నవంబర్ 23 (విజయక్రాంతి): ‘అన్‌ఫిట్ ఆఫీసర్ డైరెక్టర్ గిరీ పైరవీ’ పేరిట విజయక్రాంతి దినపత్రికలో ఈనెల 14న వచ్చిన కథనాన్ని ఐఅండ్‌పీఆర్ ఉద్యోగుల సంఘం ఖండించింది. ఇందులో వాస్త వం లేదని, ప్రభుత్వ నియమ నిబంధనల మేరకే పదోన్నతులు వచ్చాయని ఆ సంఘం తెలిపింది.
తమ శాఖలో అంతా పారదర్శకంగానే జరుగుతోందని, కొందరు కావా లని తమ శాఖకు నష్టం జరిగేలా చేస్తున్నారని సంఘం నాయకులు పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తమ శాఖ కీలకంగా పనిచేస్తోందని వారు తెలిపారు.