ఉత్వర్వులు జారీ చేసిన ప్రభుత్వం
హైదరాబాద్, నవంబర్ 28 (విజయక్రాంతి): రవాణాశాఖలో డీటీసీల కు జేటీలుగా, ఆర్టీవోలకు డీటీసీలుగా పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా జేటీసీలుగా పదోన్నతి పొందిన మామిండ్ల చంద్రశేఖర్, శివలింగయ్య, డీటీసీలుగా పదోన్నతి పొందిన రవీందర్‌కుమార్, వాణి, సదానందం, కిషన్, సురేశ్‌రెడ్డి హైదరాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
మం త్రి చొరవతోనే పదోన్నతులు సాధ్యమయ్యాయని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వాహనదారులకు మెరుగైన సేవలు అందించడం, ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు.