ఆబ్కారీ శాఖ డైరెక్టర్ చెవ్యూరు హరికిషన్
హైదరాబాద్, జనవరి 6 (విజయక్రాం తి): ఆబ్కారీ శాఖలో అర్హత కలిగిన అధికారులు, సిబ్బందికి పదోన్నతులు కల్పిస్తుస్తా మని ఆ శాఖ డైరెక్టర్ చెవ్యూరు హరికిషన్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని ఆబ్కారీ భవన్‌లో సోమవారం టీఎన్జీవోస్, నాన్ గెజిటెడ్ ఉద్యోగులతో నిర్వహించిన సమావేశం లో ఆయన మాట్లాడారు.
ఎన్‌ఫోర్స్‌మెంట్ బాగా ఎంత బాగా పనిచేస్తే ఎక్సైజ్ శాఖకు వనరులు అంతకంతకూ పెరుగుతాయన్నా రు. నాన్‌డ్యూటీ పెయిడ్ లిక్కర్ చలామణిని అరికట్టడంతోనే గత డిసెంబర్‌లో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు పెరిగాయని వెల్లడించారు. సాధారణ ఆదాయం కంటే 10 శాతం ఎక్కువగా వచ్చిందన్నారు.
ఉద్యోగులు ప్రభుత్వ నిబంధనల మేరకు పని చేయాలని, ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్‌ను ఇప్పించేందుకు ఉన్నతాధికారులు సిద్ధంగా ఉన్నా రని స్పష్టం చేశారు. సమావేశంలో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి, టీఎన్జీవో అధ్యక్షుడు మారం జగదీశ్, ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎం ముజీజ్ తదితరులు పాల్గొన్నారు.