ఆమోదం తెలిపిన డీపీసీ
హైదరాబాద్, నవంబర్ 25 (విజయక్రాంతి): రవాణా శాఖలో ఖాళీగా ఉన్న డీటీసీ, జేటీసీ పదోన్నతులకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్ నేతృత్వంలోని డిపార్టెంటల్ ప్రమోషన్ కమిటీ(డీపీసీ) సోమవారం ఆమోదం తెలిపింది. రంగారెడ్డి డీటీసీ మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్, మహబూబ్‌నగర్ డీటీసీ శివలింగయ్యలను జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్లుగా, ఉప్పల్ ఆర్టీవో వాణి, ఖమ్మం ఆర్టీవో ఆఫ్రిన్, మెహిదీపట్నం ఆర్టీవో కిషన్, కొత్తగూడెం ఆర్టీవో సదానందం, నాగోల్ ఆర్టీవో రవీందర్‌కుమార్, సూర్యాపేట ఆర్టీవో సురేశ్ రెడ్డిలకు డీటీసీలుగా డీపీసీ పదోన్నతులు కల్పించింది. త్వరలోనే ఈ పదోన్నతులకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నట్టు సమాచారం.