13-04-2025 01:44:32 AM
హర్షం వ్యక్తం చేసిన ఆర్‌అండ్‌బీఈఏ
హైదరాబాద్, ఏప్రిల్ 12 (విజయక్రాంతి): చాలాకాలంగా అపరి ష్కృతంగా ఉన్న రోడ్లు భవనాల శా ఖ పదోన్నతులను పరిష్కరించిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి, మం త్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆర్‌అండ్‌బీ ఇంజినీర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, ఈఈ వీ బాలప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు.
గత ప్రభుత్వం నిర్ల క్ష్యంతో 2021 నుంచి నిలిచిపోయిన పదోన్నతుల సమస్యలన్నింటినీ పరిష్కరించి ఒకేసారి 29 మంది ఈఈ లకు ఎస్‌ఈలుగా పదోన్నతి కల్పించారని ఆయన వెల్లడించారు. గతం లో ఎప్పుడూ లేనివిధంగా ఒకేసారి 118 మంది ఏఈఈలకు డీఈఈలుగా పదోన్నతి కల్పించడం పట్ల ఇంజినీర్లంతా సంతోషంగా ఉన్నార ని తెలిపారు. 72 మంది అర్హులైన డీ ఈఈలకు ఈఈలుగా త్వరగా పదోన్నతి కల్పించాలని కోరారు.