calender_icon.png 16 January, 2025 | 1:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణలో సీనియర్ ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు

08-08-2024 11:40:28 AM

 హైదరాబాద్‌: తెలంగాణ పలువురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులకు పదోన్నతులు దక్కాయి. రాష్ట్రంలో అదనపు డీజీలుగా ఉన్న ఐదుగురు అధికారులను డీజీపీలుగా హోదా కల్పిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డి, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ శివధర్‌ రెడ్డితోపాటు అభిలాష బిస్త్‌, సౌమ్య మిశ్రా, షికా గోయల్‌ను డీజీపీలుగా పదోన్నతులు వరించాయి. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి జీవో విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ అకాడమీ డైరెక్టర్‌గా అభిలాష బిస్త్‌, జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా, సీఐడీ చీఫ్‌ షికా గోయల్‌ విధులు నిర్వహిస్తున్నారు. వారు అవే స్థానాల్లో కొనసాగుతారని సీఎస్ వెల్లడించారు.