calender_icon.png 9 January, 2025 | 2:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈనెల చివరికల్లా పదోన్నతులు

09-01-2025 12:01:44 AM

  1. ఏడాదిలో 700 ఏఈఈ, 1,800 లష్కర్ ఉద్యోగాల భర్తీ చేశాం
  2. ఉద్యోగుల సంఘం డైరీ ఆవిష్కరణలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్

హైదరాబాద్, జనవరి 8 (విజయక్రాం తి): నీటిపారుదల శాఖలో ఈ నెల చివరికల్లా పదోన్నతులతో పాటు బదిలీల ప్రక్రియ మొదలు పెట్టనున్నట్లు రాష్ర్ట నీటిపారుదల, పౌర సరఫరాల శాఖల మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యదాస్ నాథ్, ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సీ జనరల్ అనిల్ కుమార్, ఈఎన్సీ ఓఅండ్‌ఎం విజయభాస్కర్ రెడ్డితో వేసిన ఫైవ్ మెన్ కమిటీ సిఫార్సుల మేరకే ఈ ప్రక్రియ ఉం టుందని పేర్కొన్నారు.

బుధవారం ఎర్రమంజిల్ కాలనీలోని జలసౌధలో తెలంగాణ ఏఈఈల అసోసియేషన్ రూపొందించిన 2025 డైరీని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంతకాలంగా న్యాయపరమైన అడ్డంకులు ఉండడంతో జాప్యం జరిగిందని, వాటిని అధిగమించేందుకు ఫైవ్‌మెన్ కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

రాష్ర్టంలో దశాబ్ద కాలంగా నీటిపారుదల రంగం గాడి తప్పిందని, గత ప్రభు త్వం చేసిన నిర్లక్ష్యానికి నీటిపారుదల శాఖ సంవత్సరానికి  అప్పులకు, వడ్డీలకే  రూ. 11,000 కోట్లు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. తాము వచ్చాక నీటిపారుదల శాఖను గాడిలో పెడుతున్నామన్నారు.

ఏడాదిలోనే 700 ఏఈఈలను నియమించ డంతో పాటు 1,800 మంది లష్క ర్‌లను నియమించామని, మరో 1300 ఉద్యోగాల నియామకం కోసం అనుమతిచ్చామన్నారు. కార్యక్రమంలో ఈఎన్సీ అని ల్ కుమార్, డిప్యూటీ ఈఎన్సీ శ్రీనివాస్, టీజీ వో అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఏలూరి శ్రీనివాసరావు, సత్యనారాయణతో పాటు పలువురు సంఘం నేతలు పాల్గొన్నారు.