16-02-2025 12:00:00 AM
ఎమ్మెల్సీ అభ్యర్థి ఇన్నారెడ్డి డిమాండ్
హైదరాబాద్, ఫిబ్రవరి 15 (విజయక్రాంతి): ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రమోషన్లు, నియామకాలు గిరిజనులకే చెందాలని సీపీఎస్ ఉద్యోగ సంఘాల టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి తిరుమల రెడ్డి ఇన్నారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఇన్నారెడ్డికి తెలంగాణ ట్రైబల్ టీచర్స్ ఫెడరేషన్ మద్దతు ప్రకటించింది.
ఈ సందర్భంగా ఇన్నారెడ్డి మాట్లాడుతూ.. షెడ్యూల్ ప్రకారం 317 జీవోను సరి చేయాలని, గిరిజన సంక్షేమశాఖలో ఉన్న పండితులు, పీఈటీలను అప్‌గ్రేడ్ చేయడం, టీఆర్టీలను రెగ్యులర్ చేయాలని తెలిపారు. గిరిజన ఉపాధ్యాయుల సమస్య ల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
సమావేశంలో సీపీఎస్ సంఘ రాష్ర్ట అధ్యక్షులు స్థిత ప్రజ్ఞ, రాష్ర్ట ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, ట్రైబల్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ నాయక్, ప్రధాన కార్యదర్శి గణేష్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.