calender_icon.png 25 November, 2024 | 4:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విత్తనరంగ పరిశ్రమలకు ప్రోత్సాహం

27-09-2024 03:05:36 AM

మంత్రి తుమ్మల

హైదరాబాద్, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): ప్రపంచవ్యాప్తంగా తెలం గాణ విత్తన ప్రాముఖ్యత పెరగాలని, అందుకోసం ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పేర్కొన్నారు. గురువారం రెడ్‌హిల్స్‌లోని ఫిక్కీభవన్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వితనోత్పత్తి రైతుల ప్రయోజనాలను కాపాడుతూనే విత్తనరంగ పరిశ్రమలకు తమ ప్రభుత్వం చేయూతనం దిస్తోందన్నారు. 30 ఏండ్ల క్రితం 20 నుంచి 30 మందితో ఆరంభమైన ఈ సీడ్‌మెన్ అసోసియేషన్ నేడు 507 మంది సభ్యులతో ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు చెందిన అన్ని విత్తన కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తూ, తెలం గాణను విత్తనోత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో ఉంచారని ప్రశంసించా రు.  రాష్ర్టవ్యాప్తంగా సుమారు 8 లక్ష ల ఎకరాల్లో వివిధ పంటల విత్తనోత్పత్తి జరుగుతుందన్నారు.  కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విత్తనోత్పత్తి రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రపంచ వరి సదస్సును హైద్రాబాద్‌లో నిర్వహించామన్నారు.