calender_icon.png 11 January, 2025 | 10:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సాహం

02-11-2024 12:00:00 AM

  1. రైతులు పెద్ద ఎత్తున పంట సాగు చేయాలి
  2. మీడియా సమావేశంలో ఆయిల్ ఫెడ్ ఎండీ

హైదరాబాద్, నవంబర్ 1 (విజయక్రాంతి): రైతులు ఆర్థికంగా ఉన్నత స్థితి లో ఉండాలనే ఆలోచనతోనే ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్నట్లు రాష్ట్ర ఆయిల్ ఫెడ్ ఎండీ ఎస్.కే. యాస్మిన్ భాషా తెలిపారు. రాష్ర్టంలోని రైతులు పెద్ద ఎత్తున ఆయిల్ పామ్ సాగు చేయాలని సూచించారు.

తద్వారా దేశ రైతాంగానికి మార్గదర్శకంగా నిలవాలన్నారు. శుక్రవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో ఆయన సమావేశం అయ్యారు. అనంతరం వ్యవసాయం, దాని అనుబంధ రంగాలను లాభదాయకంగా మార్చడానికి అన్ని చర్యలు తీసుకుంటున్న ట్లు మీడియా ప్రకటనలో పేర్కొన్నారు.

పామ్ ఆయిల్ సాగును పెద్ద ఎత్తున చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో ఆయిల్ పామ్ సాగు విస్తరణను చేపట్టేందుకు 14 కంపెనీలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతు లిచ్చిందన్నారు. మొదటి ఆయిల్ పామ్ తోట ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1993వ సంవత్సరంలో వేసినట్లు చెప్పారు. ప్రస్తుతం 8 జిల్లాలో ఆయిల్ పామ్‌ను సాగు చేస్తున్నారన్నారు. 

ఆయిల్ పామ్ మొక్కల కోసం 12 నర్సరీలను ఇప్పటికే ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వాటిల్లో ప్రస్తుతం 70వేల ఎకరాలకు సరిపడా ఆయిల్ పామ్ మొక్కలు అందుబాటులో ఉన్నాయన్నారు. మలేషియా, ఇండోనేషియా దేశాలు ఆయిల్ పామ్ రంగంలో అద్భుతమైన పురోగతి ప్రదర్శిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచంలోని ఇతర దేశాలకు ముడి పామాయిల్‌ను పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తున్నాయన్నారు.

ఇటీవల ఆ దేశాలు అవలంబిస్తున్న సాంకేతికత, పంట ఉత్పత్తి పద్ధతులపై అధ్యయనం చేసినట్లు వెల్లడించారు. ఆయిల్ పామ్ సాగును లాభసాటిగా చేసి, ముడి పామ్ ఆయిల్‌పై దిగుమతి సుంకాన్ని తిరిగి విధించడం ద్వారా ఇక్కడి రైతులను ప్రోత్సహించాలంటూ మంత్రి తుమ్మల కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు.