calender_icon.png 23 December, 2024 | 3:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూనియర్ అసిస్టెంట్స్‌కు ఈవోలుగా పదోన్నతి

06-10-2024 01:44:38 AM

పత్రాలు అందజేసిన మంత్రి కొండా సురేఖ  

హైదరాబాద్, అక్టోబర్ ౫ (విజయక్రాంతి): జీవో 134 ద్వారా 33 మంది జూనియర్ అసిస్టెంట్‌లకు గ్రేడ్  ఈవోలుగా పదోన్నతి ఇస్తూ దేవాదాయ శాఖ నిర్ణయం తీసుకుంది. శనివారం మంత్రి సురేఖ వారికి పత్రాలు అందజేశారు. ఆ తర్వాత ఉద్యోగులను మంత్రి సన్మానించారు. ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉద్యోగులకు పదోన్నతి కల్పించకుండా అన్యాయం చేసిందన్నారు.

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించిన ఏ సమస్యనైనా వెంటనే పరిష్కరిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. జూనియర్ అసిస్టెంట్స్‌కు గతంలోనే ప్రమోషన్ ఇచ్చి ఉంటే.. ఇప్పుడు గ్రేడ్2 ఈవోలుగా పలువురికి ప్రమోషన్ వచ్చేదన్నారు. కొత్త ఈవోలుగా బాధ్యతలు చేపట్టిన ఉద్యోగులు దేవాలయాల అభివృద్ధి, భక్తుల సౌకర్యాల విషయంలో శ్రద్ధ తీసు కో వా లన్నారు.

దేవాదాయ శాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రంగారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మర్చిపోలేనిదన్నారు. గత ప్రభుత్వంలో ప్రమోషన్లు లేక ఇబ్బందులు పడ్డామన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి సురేఖతో పాటు దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ హన్మంతరావులకు కృతజ్ఞతలు తెలిపారు.