calender_icon.png 30 October, 2024 | 11:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీటీలకు తహసీల్దార్లుగా పదోన్నతి

30-08-2024 01:58:21 AM

టీజీటీఏ నేతల హర్షం

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 29 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం మరో 83 మంది డిప్యూటీ తహసీల్దార్లకు తహసీల్దార్లుగా పదోన్నతి కల్పించింది. తెలంగాణ ఉద్యోగుల  జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి, యూనియన్ కృషి ఫలితంగానే ప్రభుత్వం పదోన్నతి కల్పించిందని తెలంగాణ తహ సీల్దార్స్ అసోసియేషన్ హర్షం వ్య క్తం చేసింది. ఈ మేరకు టీజీటీఏ రా ష్ట్ర అద్యక్షుడు ఎస్ రాములు, ప్రధానకార్యదర్శి రమేశ్ పాక, సెక్రటరీ జనరల్ ఫూల్‌సింగ్ చౌహాన్, మహి ళా విభాగం అధ్యక్షురాలు రాధ తదితరులు సీఎం రేవంత్‌రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీసీఎల్‌ఏ నవీన్ మిట్టల్‌కు ధన్యవాదాలు తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజా ప్రభుత్వంలో ఒకేసారి 83 మంది డీటీలకు పదోన్నతులు కల్పించడం గర్వించదగిన విషయమని కొనియాడారు.