19-04-2025 10:56:49 PM
డిప్యూటీ కమిషనర్ నుంచి సెలక్షన్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్ గా ఉద్యోగోన్నతి..
ఎల్బీనగర్: జీహెచ్ఎంసీ ఎల్బీనగర్ జోనల్ పరిధిలో హయత్ నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ గా పని చేస్తున్న (స్పెషల్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్) డాక్టర్ తిప్పర్తి యాదయ్యకు ప్రభుత్వం ప్రమోషన్ కల్పించింది. స్పెషల్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్ గా పనిచేస్తున్న తిప్పర్తి యాదయ్యను సెలక్షన్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్ గా ప్రమోషన్ కల్పిస్తూ శనివారం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ సెక్రటరీ ఈ నెల 16వ తేదీన జీవో నెంబర్ 213 ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ యాదయ్యను శనివారం హయత్ నగర్ సర్కిల్ అధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపి, సన్మానించారు. వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు డాక్టర్ తిప్పర్తి యాదయ్యని సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ దినేష్ సింగ్, సూపరింటెండెంట్లు మహేందర్, విక్రమ్, సుధాకర్ రావు, టాక్స్ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.