సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి
సంగారెడ్డి, డిసెంబర్ 2 (విజయక్రాంతి): అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి డిమాండ్ చేశారు. సోమవారం సంగారెడ్డిలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
సంగారెడ్డి జిల్లాలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు ద్వారా వ్యవసాయానికి సాగునీరు సరఫరా చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి ఇప్పుడు పట్టించుకోవడం లేదన్నారు. సింగూర్ ప్రాజెక్ట్ నుంచి సాగు నీరు అందిస్తామన్న చెప్పి మరిచిపోయారన్నారు.
నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానన్న రేవంత్‌రెడ్డి.. సీఎం అయ్యాక ఆ దిశగా ఎందుకు ఆలోచించడం లేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యే సంజీవ్‌రెడ్డి ప్రజల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు.
నల్లవాగు ప్రాజెక్టుకు లిఫ్ట్ పనులు చేపడతామని చెప్పి ఇంత వరకు అమలు చేయలేదన్నారు. సమావేశంలో బీజేసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అదెల్లి రవీందర్, ఎడ్ల రమేశ్, రాజేశ్వర్‌రావు దేశ్‌పాండే, అనంతరావు కులకర్ణి, మాణిక్‌రావు, రాజశేఖర్‌రెడ్డి, రాజుగౌడ్ పాల్గొన్నారు.