23-02-2025 12:00:00 AM
సీఎం రేవంత్‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సవాల్
నిజామాబాద్, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి): కాంగ్రెస్ ఇచ్చిన హామీ ల్లో కనీసం పది శాతమైన నెరవేర్చి చర్చకు రావాలని సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సవాల్ చేశారు. నిజామాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో శనివారం ఆయన ఎంపీ అర్వింద్‌తో కలిసి మీ డియాతో మాట్లాడారు.
ముఖ్యమం త్రి ఇచ్చిన హామీలలో ఇప్పటివరకు ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా నెరవేర్చలేదన్నారు. హామీ పథకాల కార్యా చరణ కూడా అమలులోకి రాలేదన్నారు. ప్రాథమికంగా కార్యాచరణ నిర్ధారణ చేసిన తర్వాత అయినా చర్చలకు రావాలని కిషన్‌రెడ్డి సూ చించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభు త్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి సీఎం చర్చకు పిలవడం హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు. కాగా బీసీలకు బీజేపీ అనుకూలమని, కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం లను బీసీల్లో కలపడం మాత్రం స హించబోమని స్పష్టం చేశారు.