ఆదివాసీ గిరిజన సంఘం వినతి
ముషీరాబాద్, జనవరి 22: అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఆదివాసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ప్రతినిధులు బుధవారం ప్రజావాణి నోడల్ అధికారి దివ్య దేవరాజన్‌ను వినతి పత్రాన్ని అందజేశారు. ఇల్లులేని ప్రతి ఆదివాసీ కుటుంబానికి ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి రూ.10 లక్షలు అందజేయాలని కోరినట్లు తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎంపీ బాబురావు, పూసం సచిన్‌లు తెలిపారు.
ఆదివాసీల అసైన్డ్ భూములను తిరిగి అసైనీలకు అన్ని హక్కులతో పునరుద్దరణ చేయాలని, భూ సేకరణ చట్టం 2013 ప్రకారం భూములను సేకరించినపుడు అసైన్డ్ భూములకు పట్టా భూములతో సమానంగా పరిహా రం చెల్లించాలని కోరినట్లు వారు తెలిపారు.